
కర్ణాటకలో థగ్ లైఫ్ రిలీజ్‌కు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా, కమల్ హాసన్ బృందానికి అసలు ఆనందం లేదంటే నమ్మండి. ఇప్పటికే తమిళ, తెలుగు భాషల్లో డిజాస్టర్ టాక్‌తో దాదాపు థియేటర్ల నుంచి బయటకి వస్తున్న ఈ ఫిల్మ్ కన్నడలో మేజిక్ చేయడం అసాధ్యమే.
పైగా హక్కులు తీసుకున్న డిస్ట్రిబ్యూటర్ సినిమాను రిలీజ్ చేయలేనని చెప్పడంతో పరిస్థితి మరింత క్లిష్టమైంది.
ఇప్పటికే తమిళ వెర్షన్ హెచ్డీ ప్రింట్లు ఆన్‌లైన్లో లీక్ అవ్వడంతో మరింత నష్టానికి గురైంది. అయితే రాజ్ కుమార్ ఇంటర్నేషనల్ సంస్థ “కర్ణాటకలో రిలీజ్ ఆగిపోవడం వల్ల 30 కోట్ల నష్టం” అని చెబుతోంది. కానీ ట్రేడ్ వర్గాలు మాత్రం.. అన్ని భాషల్లో కలిపినా 10 కోట్ల గ్రాస్ దాటేది కాదని నిశ్చితంగా అంటున్నాయి.
ఇది నిజమే అయితే కమల్ హాసన్, మణిరత్నం చేసిన ప్రచారం, ఇంటర్వ్యూలు, ట్రావెల్ అన్నీ వృథా అయ్యాయి. థగ్ లైఫ్ అసలు కెరీర్ పరంగా కూడా కష్టాలు కలిగించే స్థాయిలో ఫెయిలైంది.
ఇప్పట్లో ఈ జోడీ మళ్లీ కలిసి పనిచేయడం ఎవరూ ఊహించలేరు. మణిరత్నం అయితే పొన్నియిన్ సెల్వన్ వల్ల వచ్చిన ఫామ్‌ను ఈ ఒక్క సినిమాతో కోల్పోయారని ట్రోలింగ్ మొదలైంది.
ఇక శింబుతో తీయబోయే కొత్త సినిమా ద్వారా అయినా మణిరత్నం తిరిగి గాడిలో పడతారో లేదో చూడాలి. కమల్ కోసం ఇది నిజంగా తీరని దెబ్బ.
thug life flop, kamal haasan disaster, mani ratnam failure, thug life ott leak, sandalwood release issue,
