
కమల్ హాసన్ – మణిరత్నం కాంబినేషన్‌లో వచ్చిన థగ్ లైఫ్ థియేటర్లలో అంచనాలు నెరవేర్చలేకపోయింది. పాన్ ఇండియా రిలీజ్‌కి వెళ్లిన ఈ చిత్రం మొదటి షో నుంచే నెగెటివ్ టాక్‌ను ఎదుర్కొంది. దీంతో ప్రేక్షకుల ఆసక్తి తగ్గిపోయింది.
మూవీలో కమల్ యాక్షన్ తప్ప మిగిలిన అంశాలు ఆకట్టుకోలేదన్నది ప్రేక్షకుల సమీక్ష. త్రిష, శింబు వంటి నటీనటులతో భారీ కాస్ట్ ఉన్నప్పటికీ, కథ సరైన పట్టు లేక బాక్సాఫీస్ వద్ద నిరాశ చెందింది.
ఈ పరిస్థితిలో నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్ హక్కులు ముందే సొంతం చేసుకున్నట్లు వార్తలొచ్చాయి. మొదట సినిమాను 8 వారాల తర్వాత స్ట్రీమ్ చేస్తామన్న నెట్‌ఫ్లిక్స్, ఇప్పుడు 4 వారాలకే విడుదల చేసే యోచనలో ఉందని సమాచారం.
అంతేకాదు, సినిమా ఫలితాన్ని దృష్టిలో ఉంచుకొని 20–25% డీల్ తగ్గింపును కూడా ప్రతిపాదించినట్లు టాక్. విడుదలకు ముందు భారీ మొత్తం పెట్టడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
జూలై మొదటి వారం నుంచే నెట్‌ఫ్లిక్స్‌లో థగ్ లైఫ్ స్ట్రీమింగ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ నిర్ణయంతో సినిమా ఓటీటీలో అయినా కొంత రీచ్ అందుకుంటుందేమో చూడాలి.