
టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న మళ్లీ ఒకే సినిమా కోసం చేతులు కలిపారు. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల తర్వాత ముచ్చటగా మూడోసారి స్క్రీన్ షేర్ చేస్తున్నారు.
ఈసారి మాత్రం పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న భారీ చిత్రంలో జంటగా కనిపించనున్నారు.
యంగ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే హైదరాబాద్‌లో సైలెంట్‌గా మొదలైంది. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
కథ విన్న వెంటనే రష్మిక వెంటనే ఓకే చెప్పిందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా 1850ల కాలం బ్రిటిష్ పాలన నేపథ్యంలో సాగనుందని సమాచారం.
విజయ్ దేవరకొండ రాయలసీమ యాసలో ఒక పల్లెటూరి యువకుడి పాత్రలో కనిపించనున్నారు. ఇది ఆయన కెరీర్‌లో కొత్త ప్రయోగంగా భావిస్తున్నారు.
సినిమాలో యాక్షన్, ఎమోషనల్ సీన్స్ బలంగా ఉండబోతున్నాయని టాక్. రాహుల్ సాంకృత్యాన్ అద్భుతమైన స్క్రీన్‌ప్లేతో ఈ చిత్రాన్ని పాన్-ఇండియా స్థాయిలో తీర్చిదిద్దుతున్నారని వినిపిస్తోంది.