
న్యూస్ డెస్క్: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఇటీవల గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వచ్చిన కింగ్డమ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాలు ఉన్నా, ఆ సినిమా అనుకున్న స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది. దీంతో ఆయన నెక్స్ట్ మూవీపై ఆసక్తి మరింత పెరిగింది.
తాజా సమాచారం ప్రకారం విజయ్ ఇప్పటికే తన కొత్త ప్రాజెక్ట్‌ను సైలెంట్‌గా మొదలుపెట్టాడు. టాక్సావాలా ఫేం రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి హైదరాబాద్‌లో షూటింగ్ ప్రారంభమైంది. మొదటి షెడ్యూల్ పూర్తయిన తర్వాత రాయలసీమలో మరో కీలక షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారట మేకర్స్.
ఇక ఈ చిత్రంలో స్టార్ బ్యూటీ రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తున్నట్లు సమాచారం. ఈ కాంబినేషన్ మళ్లీ ప్రేక్షకుల్లో క్రేజ్ పెంచింది. ఈ జంట ముందే చేసిన సినిమాలు మంచి హిట్ కావడంతో, వీరి కెమిస్ట్రీ ఈ ప్రాజెక్ట్‌కు బలంగా మారనుందని అంచనాలు ఉన్నాయి.
అజయ్ అతుల్ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నారు. పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా, భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటోంది. రౌడీ స్టార్ కెరీర్‌లో ఇది మరో కీలక మలుపు కావొచ్చని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
