Thursday, June 26, 2025
HomeTop Stories2 వీలర్ పై టోల్ ఫీజు.. రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన కేంద్రం

2 వీలర్ పై టోల్ ఫీజు.. రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన కేంద్రం

toll-free-for-two-wheelers-gadkari-clarifies

ద్విచక్ర వాహనాలకు టోల్ ఫీజు వసూలు చేయనున్నట్లు వస్తున్న వార్తలపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టత ఇచ్చారు. జులై 15 నుంచి ఈ విధానం అమల్లోకి వస్తుందని ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఆయన స్పందించారు.

“ద్విచక్ర వాహనాలపై టోల్ వసూలు చేసే ఎలాంటి ప్రతిపాదన కూడా ప్రభుత్వం పరిశీలించట్లేదు. ప్రజల్లో అపోహలు కలగకుండా మీడియా నిజమైన సమాచారం పంచాలి” అని గడ్కరీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

ఈ ప్రకటనతో పాటు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) కూడా స్పందించింది. ద్విచక్ర వాహనాలకు టోల్ విధించే ప్రణాళిక తమ వద్ద లేదని, ఇలాంటి వదంతులను నమ్మరాదని తెలియజేసింది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ద్విచక్ర వాహనాలకు టోల్ మినహాయింపు వర్తిస్తోంది. ఆ విధానంలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు. ప్రజలు టోల్ గేట్‌ల వద్ద ఎలాంటి అదనపు రుసుములు చెల్లించాల్సిన అవసరం లేదు.

తప్పుడు ప్రచారాలు ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తున్నాయని, అబద్ధ వార్తలను నిర్ధారించకుండానే ప్రచురించరాదని గడ్కరీ సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular