
మెగాస్టార్ చిరంజీవి – డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్ షూటింగ్ వేగంగా సాగుతోంది. ముస్సోరీ షెడ్యూల్‌ను పూర్తిచేసిన తర్వాత, తాజాగా హైదరాబాద్‌లో మూడవ షెడ్యూల్‌ను స్టార్ట్ చేశారు.
ఈ భాగంలో చిరంజీవి – నయనతారలపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఇందులో కేథరిన్ థెరిసా, మాస్టర్ రేవంత్ వంటి ప్రముఖులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. సినిమా 2026 సంక్రాంతికి గ్రాండ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా మెగాస్టార్ మాట్లాడుతూ – ‘‘ఇది పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రం. కథ నన్ను ఆకట్టుకుంది. అనిల్ చెప్పిన కొన్ని సన్నివేశాలు వినగానే కడుపుబ్బా నవ్వాను,’’ అన్నారు.
కామెడీ పండగగా వచ్చే ఈ సినిమాను సాహు గారపాటి – సుస్మిత (చిరు కుమార్తె) కలిసి నిర్మిస్తున్నారు. చిరు నటన, అనిల్ కామెడీ టచ్‌తో భారీ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటోంది.
ఈ సినిమాపై ఇప్పటికే అభిమానుల్లో మంచి అంచనాలున్నాయి. సంక్రాంతికి మెగా పండగ ఖాయంగా కనిపిస్తోంది.
