
‘టిల్లు స్క్వేర్’తో బాక్సాఫీస్‌ను షేక్ చేసి ‘స్టార్ బాయ్’ అనిపించుకున్న సిద్ధు జొన్నలగడ్డ, ‘తెలుసు కదా‘ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అయితే, ఈ సినిమాకు ఊహించిన స్థాయిలో ఓపెనింగ్స్ రాకపోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
దీపావళి కానుకగా విడుదలైన ఈ చిత్రం, తొలిరోజు తెలుగు రాష్ట్రాల్లో కేవలం రూ. 4.8 కోట్ల గ్రాస్ మాత్రమే వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇది సిద్ధు ప్రస్తుత క్రేజ్‌కు చాలా తక్కువ మొత్తం.
దీనికి ప్రధాన కారణం, సినిమాపై సరైన బజ్ క్రియేట్ చేయడంలో మేకర్స్ పూర్తిగా విఫలం కావడమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రమోషన్ల విషయంలో కనీస ఆసక్తిని కూడా రేకెత్తించలేకపోయారు.
ముఖ్యంగా సినిమా థియేట్రికల్ ట్రైలర్ ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచింది. ట్రైలర్‌లోని బోల్డ్ కంటెంట్ హింట్స్, యూత్‌ను ఆకట్టుకోకపోగా, ఫ్యామిలీ ఆడియన్స్‌ను సినిమాకు దూరం చేశాయని అంటున్నారు.
దీనికి తోడు, ‘టిల్లు స్క్వేర్’ తర్వాత వచ్చిన ‘జాక్’ డిజాస్టర్ అవ్వడం కూడా దీనిపై ప్రభావం చూపింది. ఆ ఫ్లాప్ తర్వాత వస్తున్న సినిమాకు బలమైన ప్రమోషన్స్ అవసరమైనా, ఆ దిశగా ప్రయత్నాలు జరగలేదు.
మొత్తం మీద, సిద్ధు సోలో క్రేజ్ ఉన్నప్పటికీ, ప్రమోషన్ల లోపంతో ‘తెలుసు కదా’కు ఆశించిన ఆరంభం దక్కలేదు. ఇక సినిమా భవిష్యత్తు పూర్తిగా వచ్చే మౌత్ టాక్‌పైనే ఆధారపడి ఉంది.
