
పాన్ ఇండియా సినిమాలతో టాలీవుడ్ స్టార్స్ చేస్తున్న బాక్సాఫీస్ బీభత్సం బాలీవుడ్‌ను కదిలించింది. అందుకే బీ టౌన్ స్టార్లు సౌత్ డైరెక్టర్స్‌తో పనిచేయాలని చూస్తున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం టైం కలిసిరాని సల్మాన్ ఖాన్ మరో తెలుగు దర్శకుడితో సినిమా ప్లాన్ చేస్తున్నాడు.
మురుగదాస్‌తో చేసిన సికిందర్ డిజాస్టర్ కావడంతో, ఈసారి గురి తప్పకూడదనే ఉద్దేశ్యంతో సల్మాన్ వంశీ పైడిపల్లిని ఎంచుకున్నాడు. సల్మాన్ ఖాన్ వంశీ పైడిపల్లి సినిమాను ఎస్.వి.సీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో దిల్ రాజు నిర్మిస్తారు.
వంశీ పైడిపల్లి మూడు నాలుగేళ్లకు ఒక సినిమా చేసినా, అది సంథింగ్ స్పెషల్ గా ఉండేలా ప్లాన్ చేస్తారు. మహర్షి తర్వాత విజయ్‌తో వారిసు చేసిన వంశీ.. ఇప్పుడు సల్మాన్‌తో మరోసారి తన సత్తా చాటాలని చూస్తున్నాడు.
సల్మాన్ ఖాన్ కూడా ఈ ప్రాజెక్ట్ మీద చాలా హోప్స్‌తో ఉన్నాడు. 2026లో సెట్స్‌పైకి వెళ్లబోతున్న ఈ సినిమా మిగతా కాస్ట్ అండ్ క్రూ ఎవరన్నది త్వరలో తెలుస్తుంది.
తెలుగు దర్శకుడు కాబట్టి సల్మాన్ ఖాన్ సినిమా తెలుగులో కూడా రిలీజ్ చేసేలా ప్లానింగ్ ఉంది. దిల్ రాజు నిర్మాత కాబట్టి తెలుగు వెర్షన్ రెడీ చేయడం పెద్ద కష్టమేమి కాదు.
