
బిగ్ బాస్ సీజన్ 9 చివరి అంకానికి చేరుకుంది. మరో మూడు వారాలే మిగిలి ఉండగా, 13వ వారం నామినేషన్స్ ప్రక్రియ ఉద్రిక్తంగా జరిగింది. 12వ వారం దివ్య ఎలిమినేషన్ తర్వాత హౌస్‌లో కేవలం ఎనిమిది మంది ఉన్నారు.
నామినేషన్స్ ప్రక్రియలో ఎవరైతే నామినేట్ చేయాలని అనుకుంటున్నారో వారి తలపై బాటిల్స్ పగలకొట్టాలి. ఈ వారం భరణి, సుమన్ శెట్టి, సంజన, తనూజ, రీతు, డీమాన్ పవన్ నామినేషన్స్ లో ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ ప్రక్రియలో రీతు ఇమ్మాన్యుయెల్‌ల మధ్య భారీ మాటల యుద్ధం జరిగింది. సుమన్ శెట్టి కూడా రీతుతో వాదనకు దిగాడు. భరణి తన మెడిసిన్స్ దాచిన కారణంగా సంజనపై ఫైర్ అయ్యాడని టాక్.
నిజానికి, భరణి మొదట నామినేషన్స్‌లో లేడు. కానీ కెప్టెన్ కళ్యాణ్ పడాల డైరెక్ట్ నామినేషన్ చేయడంతో అతను నామినేషన్స్ లోకి వచ్చాడు. కెప్టెన్ కళ్యాణ్ ఇమ్మాన్యుయెల్‌లు మాత్రమే ఈ వారం సేఫ్ అయ్యారు.
ఈ చివరి మూడు ఎలిమినేషన్స్ లో తాము ఉండకూడదనే ఉద్దేశంతో హౌస్ మేట్స్ అంతా ఫైట్ చేస్తున్నారు. ఇక ఈ వారం కెప్టెన్సీ ఫైట్ ఉండదు. టికెట్ టు ఫినాలే మాత్రమే ఉంటుంది.
ఈ వారం నామినేషన్స్ నుంచే ఆట నెక్స్ట్ లెవెల్ హీటెక్కించే ప్రయత్నం చేశారు. టాప్ 8 నుంచి మరో ముగ్గురు ఎలిమినేట్ అయితే టాప్ 5 ఫైనల్ అవుతారు.
