విజయ్ దేవరకొండ హీరోగా రవికిరణ్ కోలా దర్శకత్వంలో రూపొందుతున్న రౌడీ జనార్దన్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను అక్టోబర్ నుంచి సెట్స్‌పైకి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు.
ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు దాదాపు ముగిశాయి. షూటింగ్ ఆలస్యం కాకుండా డేట్లను సెట్ చేసుకోవాలని ప్రొడక్షన్ టీమ్‌ను దిల్ రాజు స్పష్టంగా ఆదేశించారు.
ఇక తాజాగా వచ్చిన అప్‌డేట్ ప్రకారం.. ఈ సినిమాలో విలన్‌గా యాక్షన్ కింగ్ రాజశేఖర్ కనిపించబోతున్నారు. సాధారణ పాత్ర కాదు, ఏకంగా “పేట రౌడీ” లుక్‌లోనే ఆయనకు రోల్ డిజైన్ చేశారని సమాచారం. మాస్ ఇమేజ్‌ను బలంగా చూపించేందుకు స్పెషల్‌గా లుక్ టెస్టులు కూడా నిర్వహించారట.
ఈ పాత్ర కోసం ఇతర స్టార్‌లను కూడా సంప్రదించినా, చివరకు రాజశేఖర్‌ను ఫిక్స్ చేశారు. పాత్రలో ఉన్న ఘాడతను చూసి ఆయన కూడా వెంటనే అంగీకరించారట. విలన్‌గా ఇంత పవర్‌ఫుల్‌గా కనెక్ట్ అయ్యే పాత్ర తనకే రావడం సంతోషంగా ఉందని రాజశేఖర్ చెప్పినట్లు తెలుస్తోంది.
సినిమా పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో సాగనుంది. యాక్షన్‌తో పాటు రాజకీయ రంగు కూడా ఈ కథలో బలంగా ఉంటుందని సమాచారం. దీంతో విలన్ పాత్రకు మరింత బలం చేకూరనుంది.
ప్రస్తుతం విజయ్ దేవరకొండ మరో పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో బిజీగా ఉన్నప్పటికీ, రౌడీ జనార్దన్ను కూడా త్వరలోనే మొదలుపెట్టబోతున్నారు. అధికారిక అప్‌డేట్ త్వరలోనే రానుంది.