
న్యూస్ డెస్క్: భారత క్రికెట్‌లో కీలక మార్పు చోటుచేసుకుంది. సీనియర్ బ్యాటర్ రోహిత్ శర్మకు బదులుగా యువ సంచలనం శుభ్‌మన్ గిల్ వన్డే జట్టుకు కొత్త కెప్టెన్‌గా నియమితుడయ్యాడు.
అక్టోబర్ 19 నుంచి ప్రారంభమయ్యే ఆస్ట్రేలియా పర్యటన కోసం వన్డే, టీ20 జట్లను ప్రకటించిన సందర్భంగా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఈ నిర్ణయాన్ని వెల్లడించారు.
అగార్కర్ మాట్లాడుతూ “భవిష్యత్ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నాం. రెండు సంవత్సరాల తర్వాత ప్రపంచకప్ ఉంది. కొత్త కెప్టెన్ జట్టును ముందుండి నడిపించేందుకు ఇది సరైన సమయం” అని తెలిపారు.
రోహిత్ శర్మను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించడంపై ఆయనతో ఇప్పటికే చర్చ జరిగిందని చెప్పారు.
ఆసక్తికరంగా, గిల్ నేతృత్వంలోనే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌లో ఆడనున్నారు. గిల్ ఇప్పటికే టెస్టు జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. “అతను యువకుడు, ఒత్తిడి పరిస్థితుల్లో చక్కగా రాణించగలడు” అని అగార్కర్ వ్యాఖ్యానించారు.
ఇక జట్టు ఎంపికలో బుమ్రాకు విశ్రాంతి ఇచ్చారు. హార్దిక్ పాండ్యా గాయం కారణంగా ఈ సిరీస్ నుంచి దూరంగా ఉన్నాడు. టీ20 సిరీస్‌కి సూర్యకుమార్ యాదవ్ నాయకత్వం వహించనున్నాడు.
భారత క్రికెట్‌లో ఈ మార్పు కొత్త అధ్యాయానికి నాంది పలుకుతోంది. గిల్ నాయకత్వం జట్టుకు కొత్త శక్తిని తెచ్చిపెడుతుందో లేదో చూడాలి.
Shubman Gill, Rohit Sharma, ODI Captain, Ajit Agarkar, Team India,