Monday, August 11, 2025
HomeMovie Newsరవితేజ నెక్ట్స్ మూవీలో మరో బ్యూటీ ఎంట్రీ!

రవితేజ నెక్ట్స్ మూవీలో మరో బ్యూటీ ఎంట్రీ!

raviteja-next-movie-ashika-ranganath-joins-cast

మాస్ రాజా రవితేజ నటిస్తున్న మాస్ జాతర సినిమా ఇప్పటికే మంచి బజ్ సృష్టించిన నేపథ్యంలో, ఆయన తదుపరి చిత్రం పైనా ఆసక్తి నెలకొంది. ఈ సినిమాను కిషోర్ తిరుమల దర్శకత్వంలో జూన్ నెలలో ప్రారంభించేందుకు చిత్రబృందం సిద్ధమవుతోంది.

ఈ సినిమాలో కథానాయికగా ఇప్పటికే కేతిక శర్మను ఎంపిక చేసినట్టు సమాచారం. తాజాగా, ఈ సినిమాకు మరో హీరోయిన్‌గా ఆషికా రంగనాథ్ ఎంపికయ్యారని సినీ వర్గాల్లో వార్తలు వచ్చాయి. దీనితో సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది.

ఆషికా రంగనాథ్ ‘నా సామిరంగ’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ కన్నడ బ్యూటీ, ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమాతోనూ బిజీగా ఉంది. ఇప్పుడు రవితేజ సరసన నటించేందుకు సిద్ధమవుతోందని టాక్.

ఈ సినిమాలో ఆమె పాత్ర ఎలా ఉండబోతుందనే విషయం ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుందని సమాచారం.

కిషోర్ తిరుమల దర్శకత్వంలో వస్తున్న ఈ మాస్ ఎంటర్టైనర్ రెండు హీరోయిన్‌లు ఉన్న స్టోరీ లైన్‌తో రవితేజకు మరో హిట్ అందిస్తుందా అనేది వేచి చూడాలి.

raviteja, ashikaranganath, ketikasharma, kishortirumala, massjathara,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular