Sunday, August 23, 2026
HomeMovie Newsఅఖండ 2: తాండవం టీజర్‌తోనే రిలీజ్ డేట్!

అఖండ 2: తాండవం టీజర్‌తోనే రిలీజ్ డేట్!

akhanda2-release-date-update-with-teaser

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న అఖండ 2 – తాండవం సినిమాపై భారీ హైప్ నెలకొంది. బోయపాటి డైరెక్షన్‌లో బాలయ్యకి ఇది నాలుగో సినిమా కావడంతో, అభిమానులు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.

ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ ఫుల్ స్వింగ్‌లో కొనసాగుతోంది. మొదట మేకర్స్ ఈ సినిమాను దసరా విడుదలకు సిద్ధం చేస్తున్నారని టాక్ వచ్చింది. కానీ తాజా పరిస్థితుల్లో ఆ టైమ్‌కి రిలీజ్ కుదరదన్న టాక్ వినిపిస్తోంది.

అయితే అసలు క్లారిటీ మాత్రం బాలకృష్ణ బర్త్‌డే (జూన్ 10) రోజున రానుందని సమాచారం. అదే రోజు మాస్ టీజర్ రిలీజ్‌కి మేకర్స్ సన్నాహాలు చేస్తుండగా, అదే టీజర్‌లో సినిమా రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించనున్నారు.

ఈ టీజర్‌తో పాటు సినిమా పాత విడుదల తేదీనే నిలబెడతారా? లేక కొత్త డేట్‌కి వెళ్లుతారా? అన్నది కూడా టీజర్‌లోనే తేలనున్నట్టుగా సమాచారం.

సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌, యాక్షన్ సన్నివేశాలతో ఈ టీజర్ బాలయ్య మాస్ ఫ్యాన్స్‌కి పవర్‌ఫుల్ ఫీస్ట్‌గా మారనుందని సినీ వర్గాల్లో టాక్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular

MalCare WordPress Security Plugin - Malware Scanner, Cleaner, Security Firewall Firewall

Blocked because of Malicious Activities

Reference ID: 4178736336a8b6fc81a2a4