Friday, September 4, 2026
HomeMovie Newsస్టార్ హీరో రణబీర్‌..డైరెక్ట‌ర్‌గా కొత్త ప్రయాణం?

స్టార్ హీరో రణబీర్‌..డైరెక్ట‌ర్‌గా కొత్త ప్రయాణం?

Ranbir-Kapoor-Turns-Director

బాలీవుడ్‌ స్టార్ రణబీర్ కపూర్‌ తన కెరీర్‌లో రెండు దశాబ్దాలుగా అగ్రనటుడిగా నిలుస్తున్నాడు. సావారియాతో ఎంట్రీ ఇచ్చిన ఆయన, ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకుల్ని అలరించాడు. ఇప్పుడు ఆయన మరో కొత్త అడుగు వేసేందుకు రెడీ అవుతున్నాడు.

రణబీర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు అభిమానుల్లో ఆసక్తి రేపాయి. నటుడిగా మాత్రమే కాకుండా, త్వరలోనే దర్శకుడిగా మారాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పాడు. ప్రస్తుతం రైటింగ్ వర్క్‌షాప్‌లలో పాల్గొంటూ, కథల రూపకల్పనపై దృష్టి సారిస్తున్నాడని తెలిపారు.

ఈ నేపథ్యంలో అభిమానుల్లో కొత్త చర్చ మొదలైంది. రణబీర్ నటన నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నాడా? లేక డైరెక్షన్‌కి కూడా సమానంగా దృష్టి పెడతాడా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఇండస్ట్రీలో ఇప్పటికే రాఘవ లారెన్స్, ప్రభుదేవా, గౌతం మీనన్, ఎస్.జె సూర్య వంటి చాలామంది నటుడు దర్శకులుగా ప్రయాణం చేశారు. అయితే, స్టార్ హీరో ఇమేజ్‌ని వదిలి పూర్తిగా డైరెక్షన్ వైపు వెళ్లడం చాలా సవాల్ అని విశ్లేషకులు చెబుతున్నారు.

రణబీర్‌కు మాత్రం ఈ కొత్త ప్రయాణంపై పూర్తి నమ్మకం ఉన్నట్లు కనిపిస్తోంది. ఆయన చెబుతున్న విధానం చూస్తే త్వరలోనే తన దర్శకత్వ ప్రాజెక్ట్‌ను లాంచ్ చేసే అవకాశం ఉందని అనిపిస్తోంది.

మరి రణబీర్ కపూర్ హీరోగా కాకుండా దర్శకుడిగా కూడా ప్రేక్షకుల మన్ననలు పొందుతాడా? అన్నది సినీ వర్గాల్లో పెద్ద చర్చగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular