Tuesday, May 26, 2026
HomeMovie Newsరాజాసాబ్ ట్రైలర్‌.. ప్రభాస్ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ మోడ్

రాజాసాబ్ ట్రైలర్‌.. ప్రభాస్ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ మోడ్

 raja-saab-trailer-talk-prabhas-in-horror-comedy-style

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తాజా చిత్రం ది రాజాసాబ్ ట్రైలర్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. మారుతి దర్శకత్వంలో వస్తున్న ఈ హారర్ కామెడీ డ్రామా ట్రైలర్‌ అంచనాలను మరింత పెంచింది.

ట్రైలర్‌లో ప్రభాస్ లుక్, స్టైల్ కొత్తగా కనిపించింది. చాలా కాలం తర్వాత కామెడీ యాంగిల్‌లో ప్రభాస్ కనెక్ట్ అవ్వడం అభిమానులకు ప్రత్యేకంగా అనిపించింది. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ లాంటి హీరోయిన్స్ ఫ్రెష్ వైబ్ ఇచ్చారు.

సంజయ్ దత్ తాత గెటప్‌లో హారర్ టచ్ ఇచ్చారు. మహల్‌ బ్యాక్‌డ్రాప్‌లో భూతాలు, రహస్యాలు చూపించడం ఆసక్తిని పెంచింది. బామ్మ సెంటిమెంట్‌ను కూడా జోడించడం భావోద్వేగానికి టచ్ ఇచ్చింది.

విజువల్స్‌లో గ్రాఫిక్స్‌ బలంగా హైలైట్ అయ్యాయి. పొగ నుంచి దెయ్యాలు, పెద్ద బల్లులు, వికృత రూపాలు చూపిస్తూ హారర్ వాతావరణం క్రియేట్ చేశారు. అదే సమయంలో మాస్ అప్పీల్ సీన్స్ కూడా జోడించారు.

ముఖ్యంగా కామెడీ, రొమాన్స్, హారర్ ప్యాకేజీలా ట్రైలర్ కనబడింది. ఈ మిక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్ ఆడియన్స్‌ని ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

సినిమాను 2026 జనవరి 9న రిలీజ్ చేయనున్నట్లు ట్రైలర్‌తో క్లారిటీ ఇచ్చారు. కంటెంట్ క్లిక్ అయితే బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు ఖాయమే అని ట్రేడ్ టాక్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular