
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో వస్తున్న భారీ సినిమా ది రాజా సాబ్ చుట్టూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంపై అభిమానుల్లో హైప్ రోజురోజుకూ పెరుగుతోంది.
తాజాగా మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన సెన్సేషనల్ అప్‌డేట్‌ను బయటపెట్టారు. ట్రైలర్‌ను సెప్టెంబర్ 29న సాయంత్రం 6 గంటలకు గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఓ ప్రత్యేక పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు.
ఈ సినిమాలో ప్రభాస్‌తో పాటు బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఆయన పాత్రకు కూడా ప్రత్యేకంగా ప్రాధాన్యం ఇచ్చారని సమాచారం.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. హీరోయిన్లుగా మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ నటిస్తున్నారు.
హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 2026 ది రాజా సాబ్ జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది.
మొత్తానికి ప్రభాస్ కోసం పూర్తిగా కొత్త జోనర్‌లో రూపొందుతున్న ఈ సినిమా, మారుతి కెరీర్‌కు కూడా మైలురాయిగా నిలిచే అవకాశం ఉందని సినీ వర్గాలు అంటున్నాయి.
