Tuesday, May 26, 2026
HomeMovie Newsప్రభాస్ రాజా సాబ్‌తో వింటేజ్ వైబ్స్

ప్రభాస్ రాజా సాబ్‌తో వింటేజ్ వైబ్స్

prabhas-raja-saab-comedy-timing-maruthi-og-inspiration-3102bc

న్యూస్ డెస్క్: రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు వరుస సీరియస్ యాక్షన్ సినిమాలు కాకుండా, తన అభిమానులు మిస్ అవుతున్న కామెడీ టైమింగ్‌ను బయటికి తీయబోతున్నాడు. మారుతి దర్శకత్వంలో వస్తున్న ‘రాజా సాబ్‘ సినిమాతో ప్రభాస్ మళ్లీ వింటేజ్ వైబ్‌ను గుర్తు చేస్తారని తెలుస్తోంది.

ఈ సినిమా అంతా మారుతి మార్క్ ఎంటర్‌టైనర్ మోడ్‌లో ఉంటుందని, అయితే రెబల్ ఫ్యాన్స్ ఆశించే మాస్ అంశాలు కూడా పుష్కలంగా ఉంటాయని అంటున్నారు.

ప్రభాస్ క్యారెక్టరైజేషన్ ఈ సినిమాలో ఫ్యాన్స్‌కు ఒక సూపర్ ఫీస్ట్ ఇస్తుందట. ‘రాజా సాబ్’ థ్రిల్లర్ జోనర్‌లో వస్తున్నప్పటికీ, ప్రభాస్‌లోని కామెడీ టైమింగ్‌ను దర్శకుడు పర్ఫెక్ట్‌గా వాడుకుంటున్నారని సమాచారం. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ ఈ సినిమాలో హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.

‘రాజా సాబ్’ ఈసారి పొంగల్ రేసులో బాక్సాఫీస్‌పై ఒక రేంజ్‌లో ఇంపాక్ట్ చూపిస్తుందని అంచనా వేస్తున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా ఇమేజ్ పెరిగింది. అప్పటినుంచి ఆయన వరుసగా యాక్షన్ సినిమాలు చేస్తుండటంతో, బుజ్జిగాడి తరహా సినిమాలను ఫ్యాన్స్ కోల్పోతున్నారనే ఫీలింగ్ ఉంది.

ప్రభాస్ అభిమానులు కోరుకుంటున్న ఆ ఫ్యాన్ ఫీస్ట్‌ను రాజా సాబ్ తీరుస్తుందని తెలుస్తుంది. ఈ సినిమాకు థమన్ అందిస్తున్న మ్యూజిక్ కూడా హైలైట్స్‌లో ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular