
న్యూస్ డెస్క్: తాజాగా విడుదలైన ‘K-ర్యాంప్‘ ట్రైలర్ పూర్తిస్థాయి యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ఉంది. ఈ సినిమాలో మాస్ కామెడీ, కమర్షియల్ యాక్షన్ ఎలిమెంట్స్ రెండూ ఉన్నట్లు తెలుస్తోంది.
ట్రైలర్ చూస్తుంటే, హీరో కుమార్ (కిరణ్) తన గర్ల్‌ఫ్రెండ్‌తో ఉన్న రిలేషన్‌షిప్‌లో పడే ఫ్రస్ట్రేషన్, భయం నేపథ్యంలో కథ నడుస్తున్నట్లు అర్థమవుతోంది. ‘నా పేరు అబ్బవరం… ఇస్తా వరం’ లాంటి డైలాగ్స్‌ను సోషల్ మీడియా మీమ్స్‌నువాడుకుంటూ, రీసెంట్ ట్రెండ్‌కు కనెక్ట్ అయ్యేలా ట్రైలర్‌ను కట్ చేశారు.
ఈ సినిమాలో సీనియర్ నరేష్, వెన్నెల కిషోర్, సాయికుమార్ వంటి నటుల పాత్రలు మంచి ఫన్ క్రియేట్ చేయబోతున్నట్లు స్పష్టమవుతోంది. కాలేజ్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఎక్కువ శాతం కేరళలో షూటింగ్ జరపడం విజువల్‌గా కొత్త అనుభూతిని ఇస్తుంది.
వరుస ఫెయిల్యూర్స్ తర్వాత ‘క’ సినిమాతో కమ్‌బ్యాక్ ఇచ్చిన కిరణ్ అబ్బవరం, ఇప్పుడు తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను దీపావళి రేసులో దింపుతున్నాడు. ప్రస్తుత రోజుల్లో ఇలాంటి కామెడీ కథలు క్లిక్కయితే బాగానే ఉంటుంది, కానీ ఏమాత్రం రొటీన్‌గా అనిపించినా ఆడియెన్స్ లైట్ తీసుకునే ప్రమాదం ఉంది.
