Monday, October 5, 2026
HomeMovie NewsOTT మహాభారత 'కురుక్షేత్రం' వెబ్ సిరీస్: మెప్పించిందా?

OTT మహాభారత ‘కురుక్షేత్రం’ వెబ్ సిరీస్: మెప్పించిందా?

kurukshetram-web-series-review-netflix-mahabharat-3102bc

న్యూస్ డెస్క్: మహాభారతం నేపథ్యంతో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ‘కురుక్షేత్రం’ యానిమేటెడ్ వెబ్ సిరీస్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఉజాన్ గంగూలీ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌ను చాలా బాగా రూపొందించారు.

యానిమేటెడ్ సినిమానే అయినా, మంచి విజువల్స్‌తో మెప్పిస్తుంది. ప్రతి పాత్ర గుర్తుండిపోయేలా డిజైన్ చేయడంతో పాటు, యుద్ధంలోని గ్రాండియర్‌ను ఎక్కడా తగ్గించకుండా విజువల్ ట్రీట్ ఇచ్చారు.

‘కురుక్షేత్రం’ సిరీస్‌ను 18 ఎపిసోడ్స్‌గా ప్లాన్ చేశారు. అయితే, ప్రస్తుతం 9 ఎపిసోడ్స్ మాత్రమే స్ట్రీమింగ్ అవుతున్నాయి. మిగతా ఎపిసోడ్స్ ఈ నెల 24న రిలీజ్ అవుతాయని తెలుస్తుంది.

ఈ సిరీస్ ఎక్కడ పెద్దగా బోర్ కొట్టకుండా, యుద్ధంతో మొదలై మధ్యలో ఫ్లాష్ బ్యాక్‌లతో ఆడియన్స్‌ను ఎంగేజ్ చేసింది.

మహాభారతంలో, అందులోనూ కురుక్షేత్రం కథను యానిమేటెడ్‌గా చెప్పాలనుకోవడం పెద్ద సాహసమే. అయితే ఈ టీమ్ దాన్ని విజయవంతంగా తెరపైకి తీసుకురాగలిగింది.

అక్కడక్కడ కాస్త స్లో అనిపించడం, హాలీవుడ్ సూపర్ హీరో మూవీస్ రిఫరెన్స్ లు తీసుకున్నట్టు అనిపించినా, మొత్తం మీద సిరీస్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఈ సిరీస్‌లో కథ పాండవులు అరణ్యవాసం పూర్తి చేసిన తర్వాత మొదలవుతుంది. తమకు ఇవ్వాల్సిన రాజ్యభాగాన్ని కౌరవులు ఇవ్వకపోవడం, కనీసం ఐదు ఊళ్లు పంచివ్వమన్నా దుర్యోధనుడి దురాశ వల్ల నిరాకరించడం జరుగుతుంది.

కృష్ణుడి మాట మేరకు పాండవులు ఓపికతో ఉన్నప్పటికీ, సంజయుడి రాయబారం కూడా విఫలమవుతుంది.

కౌరవులు యుద్ధం కోరుతున్నారని గ్రహించిన పాండవులు కూడా యుద్ధానికి సిద్ధమవుతారు. ఈ సమయంలోనే కృష్ణుడు సహాయం కోసం దుర్యోధనుడు, అర్జునుడు ఇద్దరూ అడుగుతారు. తర్వాత కురుక్షేత్ర యుద్ధం మొదలవుతుంది.

అర్జునుడికి కృష్ణుడు గీతోపదేశం చేయడం, యుద్ధంలో ఏం జరిగింది అనేది ఈ కథాంశం. మహావతార్ నరసింహా సినిమా సూపర్ హిట్ అవ్వడంతో, ఇలాంటి యానిమేటెడ్ సినిమాలకు మరింత క్రేజ్ ఏర్పడింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular