
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె వరుసగా రెండు టాలీవుడ్ ప్రాజెక్ట్‌లు స్పిరిట్ మరియు కల్కి 2898 AD 2 నుంచి తప్పించబడటం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ఈ రెండూ కూడా ప్రభాస్ హీరోగా చేస్తున్న సినిమాలే కావడం ఆసక్తికరంగా మారింది.
దీపిక ఫ్యాన్స్ వాదన ప్రకారం, ఈ పరిణామాలకు కారణం ప్రభాస్ అని సోషల్ మీడియాలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వారి మాటల్లో, హీరో సపోర్ట్ లేకుండా నిర్మాతలు లేదా దర్శకులు ఇంత పెద్ద నిర్ణయం తీసుకునే ధైర్యం చేయరని అంటున్నారు.
అయితే ఇండస్ట్రీలో వినిపిస్తున్న నిజాలు వేరుగా ఉన్నాయి. ప్రభాస్ తన సినిమాల్లో కాస్టింగ్ విషయంలో ఎప్పుడూ జోక్యం చేసుకోరని, ఈ నిర్ణయాలు పూర్తిగా డైరెక్టర్, ప్రొడ్యూసర్ల ఆధీనంలో ఉంటాయని తెలిసింది. అంటే ప్రభాస్‌ను బ్లేమ్ చేయడం సరైనది కాదనే మాట బలంగా వినిపిస్తోంది.
అదే సమయంలో దీపికా రెమ్యునరేషన్, షెడ్యూల్ ఇష్యూస్ కూడా కారణం కావచ్చని అనేక కామెంట్లు వస్తున్నాయి. బడ్జెట్, టైమ్ మేనేజ్‌మెంట్‌లో వైజయంతి మూవీస్ వంటి ప్రొడక్షన్ హౌజ్‌లు చాలా జాగ్రత్తగా ఉంటాయి.
ఇక ముఖ్యమైన పాత్రకు కొత్తగా ఎవరిని ఎంపిక చేస్తారన్న ఆసక్తి పెరుగుతోంది. బాలీవుడ్ నుంచి మరో స్టార్ హీరోయిన్ వస్తుందా? లేక టాలీవుడ్ నుంచి ఎవరైనా అవకాశం దక్కించుకుంటారా అన్నది క్లారిటీ వచ్చే రోజుల్లో తెలుస్తుంది.
ఏదేమైనా ప్రభాస్‌పై వస్తున్న ఆరోపణలు ఎక్కువగా సోషల్ మీడియా ఊహాగానాలేనని, వాస్తవ పరిస్థితి మాత్రం వేరే ఉండొచ్చని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.
