Monday, January 19, 2026
HomeMovie Newsఏపీ ప్రభుత్వ నిర్ణయం: OG ప్రీమియర్ టైమింగ్స్ లో మార్పు

ఏపీ ప్రభుత్వ నిర్ణయం: OG ప్రీమియర్ టైమింగ్స్ లో మార్పు

og-premiere-show-timings-change-in-ap

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన OG (They Call Him OG) సినిమా రిలీజ్ కౌంట్‌డౌన్ స్టార్ట్ అయిపోయింది. సెప్టెంబర్ 25న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానున్న ఈ సినిమాకు ముందు రోజు నుంచే ఓవర్సీస్ లో ప్రీమియర్స్ ఏర్పాటు చేశారు. అడ్వాన్స్ బుకింగ్స్ అక్కడ ఫుల్ జోష్ లో జరిగాయి.

తెలుగు రాష్ట్రాల్లో కూడా మేకర్స్ బెనిఫిట్ షోలు వేయడానికి ప్రయత్నించారు. మొదట ఏపీలో 25న తెల్లవారుజామున 1 గంటకు షో పెట్టడానికి జీవో కూడా వచ్చింది. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం 24న రాత్రి 9 గంటలకు మాత్రమే అనుమతిచ్చింది. దీంతో రెండు రాష్ట్రాల్లో వేర్వేరు టైమింగ్స్ రావడం ఫ్యాన్స్ కి కన్ఫ్యూజన్ కలిగించింది.

అందుకే మేకర్స్ మరోసారి ఏపీ ప్రభుత్వాన్ని సంప్రదించారు. చివరికి ఏపీ సర్కార్ సవరించిన జీవో జారీ చేసింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా 24న రాత్రి 10 గంటలకు ప్రీమియర్ షో పెట్టే అవకాశం ఇచ్చారు. దీంతో రెండు రాష్ట్రాల్లో ఒకేసారి OG ప్రీమియర్స్ జరగనున్నాయి.

టికెట్ ధరను మాత్రం రూ.1000 (జీఎస్టీతో కలిపి)గా ఫిక్స్ చేశారు. ఇంత హైప్ తో షోలు వేయడం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి పండుగ వాతావరణం సృష్టించింది. అన్ని థియేటర్లలో బుకింగ్స్ వేగంగా నిండిపోతున్నాయి.

సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటు ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక అరుల్ మోహన్, శ్రీయా రెడ్డి, అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహించగా, తమన్ సంగీతం అందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular