Sunday, July 26, 2026
HomeMovie News‘పెద్ది’ ఫస్ట్ సాంగ్ కోసం మెగా ప్లాన్.. రెహమాన్ లైవ్ లో లాంచ్!

‘పెద్ది’ ఫస్ట్ సాంగ్ కోసం మెగా ప్లాన్.. రెహమాన్ లైవ్ లో లాంచ్!

peddi-first-song-live-launch-arrahman

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’పై అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే గ్లింప్స్ వీడియోతో హైప్ పెంచిన యూనిట్, ఇప్పుడు మ్యూజిక్ ప్రమోషన్ పై దృష్టి సారించింది.

ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఆల్బమ్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

దసరాకు అనుకున్న ఫస్ట్ సింగిల్ దీపావళికి కూడా రాకపోవడంతో అభిమానుల్లో కాస్త నిరాశ నెలకొంది. అయితే ఈ ఆలస్యం వెనుక మాస్టర్ ప్లాన్ ఉందట.

పాట చిత్రీకరణ పూర్తయ్యాక ఏఆర్ రెహమాన్ స్వయంగా మిక్సింగ్, రీ రికార్డింగ్ పర్యవేక్షించనున్నారు. క్వాలిటీ విషయంలో రాజీ పడకూడదనే బుచ్చిబాబు నిర్ణయంతో ఆలస్యం జరిగిందని సమాచారం.

నవంబర్ 8న రామోజీ ఫిల్మ్ సిటీలో ఏఆర్ రెహమాన్ లైవ్ కాన్సర్ట్ జరుగనుంది. ఆ వేడుకలోనే ‘పెద్ది’ మొదటి పాటను గ్రాండ్ లాంచ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. లైవ్ ఈవెంట్ ద్వారా రిలీజ్ చేయడం వలన సాంగ్ బజ్ మరో లెవెల్ లోకి వెళ్తుందని భావిస్తున్నారు.

ఇక సినిమా మాత్రం నిర్ణయించినట్టే 2026 మార్చి 27న విడుదల కానుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ స్పోర్ట్స్ డ్రామాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, శివరాజ్ కుమార్, జగపతి బాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular