
పవన్ కళ్యాణ్ నటిస్తున్న “ఓజి” సినిమాపై అపారమైన అంచనాలు ఉన్నాయి. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది.
ఈ సినిమా గురించి మొదటి నుంచి భారీ చర్చ కొనసాగుతోంది. ముఖ్యంగా థియేటర్లలో విడుదల ఎప్పుడు అనే విషయం అందరికీ ఆసక్తిని కలిగించింది. ఇక రిలీజ్ విషయంలో అఖండ 2 తో క్లాష్ ఉంటుందనే వార్తలు బయటికి వచ్చాయి.
కానీ తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం ఇప్పుడు మాత్రం ఒక్క “ఓజి” మాత్రమే వస్తుందని క్లారిటీ వచ్చింది. అన్ని ఏరియాస్ లో బిజినెస్ కూడా పూర్తయ్యిందని టాక్ వినిపిస్తోంది.
దీనితో సెప్టెంబర్ 25న ఓజి థియేటర్లలోకి రానుందని ఫిక్స్ అయిపోయినట్టే. ఈ అప్‌డేట్ తో పవన్ కళ్యాణ్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా, డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.
