
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న “ఓజి” సినిమా నుంచి మరో ఆసక్తికర అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈసారి మేకర్స్ హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.
ప్రియాంకను ‘కన్మణి’గా పరిచయం చేస్తూ రెండు పోస్టర్లు రిలీజ్ చేశారు. అందులో ఒక పోస్టర్‌లో ఆమె అందంగా కనిపిస్తుండగా, మరొకదాంట్లో ఓజాస్ భార్యగా చూపించారు. దీంతో కథలో ఆమె పాత్రకు మంచి ప్రాధాన్యత ఉండబోతోందని అభిమానులు ఊహిస్తున్నారు.
ఇక మేకర్స్ ఈ పోస్టర్లతో పాటు మరో ప్రామిస్ కూడా ఇచ్చారు. త్వరలోనే రెండో సాంగ్ ప్రోమోను విడుదల చేస్తామని అధికారికంగా ప్రకటించారు. దీనితో అభిమానుల్లో మరింత ఉత్సాహం నెలకొంది.
ఇటీవలే విడుదలైన మొదటి పాట మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇప్పుడు రెండో పాటపై అంచనాలు పెరిగాయి. పవన్ ప్రియాంక జంట కెమిస్ట్రీ ఎలా ఉంటుందనే ఆసక్తి మరింత పెరిగింది.
మొత్తానికి ఈ ఫస్ట్ లుక్, కొత్త అప్‌డేట్‌తో “ఓజి”పై ఉన్న హైప్ మరోస్థాయికి చేరుకుంది. సినిమా రిలీజ్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
