
నందమూరి కుటుంబంలో మళ్లీ విషాదం చోటుచేసుకుంది. సీనియర్ ఎన్టీఆర్ వారసుల్లో ఒకరైన నందమూరి జయకృష్ణ సతీమణి పద్మజ కన్నుమూసిన వార్త శోకసంద్రంగా మారింది.
ఆమె కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. చివరి రోజుల్లో శ్వాసకోశ సమస్యలు ఎదురుకావడంతో ఆసుపత్రిలో చేరారు. కానీ వైద్యులు చేసిన చికిత్స ఫలించకపోవడంతో తుది శ్వాస విడిచారు.
నందమూరి తారక రామారావు, బసవరామ తారకంల పెద్ద కోడలు అయిన పద్మజ, కుటుంబానికి ఆధారస్తంభంలా నిలిచారు. ఆమె మృతి నందమూరి వంశానికి పెద్ద దెబ్బగా మారింది.
ఈ వార్త తెలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, దగ్గుబాటి పురందేశ్వరి వెంటనే బయలుదేరారు. కుటుంబ సభ్యులు, బంధువులు అంతా హైదరాబాద్‌కి చేరుకుంటున్నారు.
నందమూరి అభిమానులు సోషల్ మీడియాలో సంతాపం వ్యక్తం చేస్తున్నారు. పద్మజ ఆత్మకు శాంతి చేకూరాలని అందరూ ప్రార్థిస్తున్నారు. ఓం శాంతి.
