
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన “ఓజీ” సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించింది. ఈ సినిమాతో దర్శకుడు సుజీత్ మరోసారి తన దర్శకత్వ ప్రతిభను చాటుకున్నాడు.
ఇప్పుడు అదే విజయాన్ని కొనసాగిస్తూ ఓజీ సీక్వెల్ ప్లాన్‌లో ఉన్నట్లు సమాచారం. సుజీత్ సీక్వెల్‌పై స్పష్టత ఇవ్వకపోయినా, పవన్ కళ్యాణ్ ఇప్పటికే తన ప్రసంగాల్లో “సుజీత్ నాకు ఓ సీక్వెల్ ఐడియా చెప్పాడు” అని చెప్పడంతో ఈ ప్రాజెక్ట్‌పై హైప్ పెరిగింది.
అయితే, సీక్వెల్‌లో పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో ఉంటారా? లేక ఆయన వారసుడు అకీరా నందన్ హీరోగా ఎంట్రీ ఇస్తారా? అన్నది ఆసక్తి రేపుతోంది.
ఇదిలా ఉండగా, సుజీత్ ప్రస్తుతం నాని హీరోగా ఓ యాక్షన్ సినిమా చేయబోతున్నాడు. ఆ సినిమా పూర్తయిన తర్వాత ఓజీ సీక్వెల్‌పై ఫోకస్ చేయనున్నాడు.
ఈ సీక్వెల్‌లో అకీరా హీరోగా నటించి, పవన్ గెస్ట్ రోల్‌లో కనిపిస్తే.. ఫ్యాన్స్‌కి డబుల్ ట్రీట్ అవుతుంది. ఈ కాంబినేషన్‌పై టాలీవుడ్‌లో హైప్ రోజురోజుకు పెరుగుతోంది.