Thursday, February 12, 2026
HomeBig Storyకాంతార: చాప్టర్-1 మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?

కాంతార: చాప్టర్-1 మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?

Kantara-Chapter-1-Movie-Review

‘కాంతార’తో సంచలనం సృష్టించిన రిషబ్ శెట్టి, ఇప్పుడు ప్రీక్వెల్‌గా తీసుకొచ్చిన ‘కాంతార: చాప్టర్-1’ భారీ అంచనాల నడుమ రిలీజ్ అయింది. దేవుడు, ప్రకృతి, మానవ లోభం మధ్య జరిగే ఈ కథ ప్రేక్షకులను మరో మిస్టిక్ ప్రపంచంలోకి తీసుకెళ్లగలిగిందా? చూద్దాం.

కథ:
వందల ఏళ్ల క్రితం భాంగ్రా రాజ్యం రాజు అటవీ ప్రాంతంలో ఉన్న కాంతార సంపదను ఆక్రమించాలనుకుంటాడు. కానీ అతని ప్రయత్నం విఫలమవుతుంది. రాజు కుమారుడు సింహాసనం ఎక్కినా, కులశేఖర (గుల్షన్ దేవయ్య) పాలనలో అదే లోభం పునరావృతమవుతుంది.

మరోవైపు కాంతార తెగకు నాయకుడైన బర్బే (రిషబ్ శెట్టి) తన ప్రజల ఉనికిని కాపాడేందుకు పోరాడుతాడు. భాంగ్రా దాడులు, తెగకు వచ్చిన సంక్షోభం, కాంతార భవిష్యత్తు చుట్టూ కథ తిరుగుతుంది.

విశ్లేషణ

సాధారణ కథనం అనిపించినా, దేవుని ఎలిమెంట్ చేరిన వెంటనే సినిమా బలపడింది. ఫస్ట్ హాఫ్ కొంత సాదాసీదాగా సాగుతుండగా, ఇంటర్వెల్ తర్వాత రిషబ్ విజువల్ మాయాజాలం మొదలైంది.

సెకండ్ హాఫ్ మొత్తం ఇంటెన్స్ డ్రామా. విలన్ పాత్ర సీరియస్ అవ్వడం, హీరో పరిణామం కావడం, తెగ ఉనికి కోసం యుద్ధం ఇవన్నీ థ్రిల్లింగ్‌గా అనిపిస్తాయి.

రిషబ్ శెట్టి నటనే సినిమాకి పెద్ద అస్త్రం. యాక్షన్, భావోద్వేగాలు, డివైన్ కనెక్ట్ అన్నీ కలిపి వేరే స్థాయిలోకి తీసుకెళ్ళాయి. చివరి సన్నివేశాలు మంత్ర ముగ్ధుల్ని చేస్తాయి.

ప్లస్ పాయింట్స్

రిషబ్ శెట్టి నటన, దర్శకత్వం
అద్భుతమైన విజువల్స్, సిజి వర్క్
రెండో భాగంలో ఇంటెన్స్ డ్రామా

అజనీష్ లోక్‌నాథ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్

మైనస్ పాయింట్స్

ఫస్ట్ హాఫ్‌లో స్లో పేస్
కొన్ని ఎపిసోడ్స్ లో అనవసర కామెడీ ఎక్కువగా ఉండటం

రేటింగ్: 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular