మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రలో నటించిన హారర్ డివోషనల్ చిత్రం ఓదెల 2 థియేటర్లలో పర్వాలేదనిపించినా, ఓటిటిలో మాత్రం మంచి రెస్పాన్స్ రావొచ్చనే అంచనాలు నెలకొన్నాయి. ‘రచ్చ’ ఫేమ్ సంపత్ నంది దర్శకత్వ పర్యవేక్షణలో అశోక్ తేజ దర్శకత్వం వహించిన ఈ సినిమా త్వరలోనే డిజిటల్ వేదికపై సందడి చేయబోతోంది.
ఈ సినిమాకి సంబంధించి ఓటిటి హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో కొనుగోలు చేసినట్టు సమాచారం. అప్‌డేట్ ప్రకారం మే 16న లేదా అంతకు ముందు ఓదెల 2 ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుందన్న అంచనాలు ఉన్నప్పటికీ, అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రావాల్సి ఉంది.
తమన్నా భిన్నమైన పాత్రలో కనిపించిన ఈ సినిమాలో హారర్ మూమెంట్స్‌కు తోడు దేవతా విశ్వాసాల మిక్స్ ఆకట్టుకున్నాయి. థియేటర్లలో ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ, ఓటిటిలో మంచి రెస్పాన్స్ వస్తుందని టీవీ, వెబ్ ప్రేక్షకులు భావిస్తున్నారు.
ఈ సినిమాకు అజనీష్ లోకనాథ్ సంగీతం అందించగా, డి మధు భారీ బడ్జెట్‌తో నిర్మించారు. టెక్నికల్ గా క్వాలిటీ స్టాండర్డ్స్ మెప్పించాయి. ఓటిటిలో తమన్నా మ్యాజిక్ ఎలా వర్కౌట్ అవుతుందో చూడాలి మరి!