
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాస్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో రాబోతున్న భారీ ప్రాజెక్ట్‌పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి క్రేజీ అప్‌డేట్ బయటికి వచ్చింది. కథలో ఓ కీలకమైన స్పెషల్ రోల్ కోసం బాలీవుడ్ టాప్ హీరోని తీసుకోవాలని అట్లీ ప్లాన్ చేస్తున్నాడట.
ఈ పాత్ర సినిమాకు ఓ ప్రధాన మలుపుగా మారనుండగా, అది ఎవరు పోషిస్తారన్న దానిపై ఇప్పుడే చర్చ మొదలైంది. మరోవైపు హీరోయిన్‌గా కియారా అద్వానీ ఎంపికైనట్లు సినీ వర్గాల టాక్. బన్నీ-కియారా కాంబోపై ప్రేక్షకుల్లో మంచి కురియాసిటీ ఉంది.
అట్లీ ఈ సినిమాను మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించబోతున్నాడు. అల్లు అర్జున్ ఓ డాన్ పాత్రలో కనిపించనున్నాడట. స్క్రిప్ట్‌లో యాక్షన్‌తో పాటు ఎమోషనల్ డోస్ కూడా పుష్కలంగా ఉంటుందని సమాచారం. ఈ సినిమాలో బన్నీ కొత్త గెటప్‌లో సందడి చేయనున్నాడు.
సన్ పిక్చర్స్ ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుందని టాక్. విడుదల తేదీపై ఇంకా అధికారిక సమాచారం లేకపోయినా, 2026 సమ్మర్ టార్గెట్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఈ సినిమా తర్వాత బన్నీ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించనున్నాడు. మూడోసారి ఈ కాంబో రిపీట్ కావడం ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా కానుంది.
allu arjun, atlee, kiara advani, bollywood hero, pan india movie,
