
టాలీవుడ్‌లోకి చిన్న వయసులో అడుగుపెట్టి స్టార్‌డమ్ అందుకున్న శ్రీలీల, తన నటనతో పాటు గ్లామర్ అండ్ డాన్స్ పరంగా కూడా యూత్‌ను ఆకట్టుకుంటోంది. వరుస అవకాశాలతో బిజీగా ఉన్న ఆమె, సినిమాలు, పర్సనల్ లైఫ్ విషయాలతోనూ వార్తల్లో నిలుస్తోంది.
తాజాగా బాలీవుడ్ యాక్టర్ కార్తీక్ ఆర్యన్‌తో ప్రేమలో ఉందన్న రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితంపై స్పందించిన శ్రీలీల, పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
‘‘నాకు ఇప్పుడే 24 సంవత్సరాలు. నాకు పెళ్లి 30 ఏళ్ల తరువాతే జరుగుతుంది. అప్పుడు వరకు ఈ విషయాలు మాట్లాడకండి. మమ్మీ ఎక్కడికెళ్లినా ఉంటుంది. అలాంటప్పుడు ప్రేమలో పడడమా?’’ అంటూ ప్రశ్నించింది.
ఇకపోతే తనపై వస్తున్న రూమర్స్‌పై కూడా క్లారిటీ ఇచ్చింది. ‘‘ప్రస్తుతం లవ్‌లో లేను. నా కెరీర్‌పై ఫోకస్ పెట్టాలని ఉంది’’ అని స్పష్టం చేసింది.
ఈ మాటలతో శ్రీలీల వ్యక్తిగత విషయాలపై క్లారిటీ ఇచ్చినట్లు ఫ్యాన్స్ భావిస్తున్నారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఆమె మాటల్ని కూడా రకరకాలుగా విశ్లేషిస్తున్నారు.
టాలీవుడ్‌లో స్పీడ్‌గా ఎదుగుతున్న శ్రీలీల, తన కెరీర్‌పైనే ఫోకస్ చేస్తూ వ్యక్తిగత విషయాలపై స్పష్టత ఇచ్చిన తీరు కొందరికి సర్‌ప్రైజ్‌గా మారింది. ఈ వివరణతో కార్తీక్ ఆర్యన్ గాసిప్స్ ముగుస్తాయా అనేది చూడాలి.
