Friday, June 27, 2025
HomeMovie Newsనితిన్ తమ్ముడు మూవీ.. డిజిటల్ రైట్స్‌పై బంపర్ డీల్

నితిన్ తమ్ముడు మూవీ.. డిజిటల్ రైట్స్‌పై బంపర్ డీల్

nithiin-tammudu-movie-ott-deal-netflix-satellite-rights-details

యంగ్ హీరో నితిన్ నటించిన తమ్ముడు మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఒక మాస్ హిట్ కోసం ఎదురుచూస్తున్న నితిన్.. ఈ మూవీపై తన కెరీర్‌లో కీలకంగా భావిస్తున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం జులై 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

ఈ చిత్రంలో నితిన్ అక్కగా సీనియర్ నటి లయ నటిస్తుండగా, హీరోయిన్‌గా కాంతారా ఫేమ్ సప్తమి గౌడ కనిపించనుంది. అక్కను రక్షించేందుకు తమ్ముడు చేసే పోరాటం నేపథ్యంలో ఈ సినిమా సాగనుంది. భావోద్వేగంతో కూడిన బంధం, యాక్షన్ ఎలిమెంట్స్ సినిమాకు హైలైట్ కానున్నాయి.

దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం నాన్ థియేట్రికల్ హక్కుల దశలోనే బంపర్ డీల్ దక్కించుకుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌ డిజిటల్ రైట్స్‌ను, స్టార్ మా శాటిలైట్ హక్కులను సొంతం చేసుకున్నట్లు సమాచారం.

ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కి మంచి స్పందన లభించడంతో సినిమాపై పాజిటివ్ బజ్ నెలకొంది. ట్రెండింగ్‌లో కొనసాగుతున్న ఈ మూవీ రెండో ట్రైలర్‌ను త్వరలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

నాన్ థియేట్రికల్ డీల్ ద్వారా రూ.38 కోట్లు వచ్చాయని, సినిమా బడ్జెట్ రూ.75 కోట్లు అని టాక్. దీంతో థియేట్రికల్ బిజినెస్ ద్వారా రూ.37 కోట్లు రావాల్సిన పరిస్థితి. అయితే ప్రస్తుత బజ్‌ను బట్టి హిట్ ఖాయం అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

nithiin, tammudu movie, netflix ott deal, dil raju, sappthami gowda,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular