Friday, March 13, 2026
HomeMovie Newsదిల్ రాజు లైన్‌అప్ రెడీ.. భారీ ప్రాజెక్టులతో మళ్లీ గేర్‌లోకి!

దిల్ రాజు లైన్‌అప్ రెడీ.. భారీ ప్రాజెక్టులతో మళ్లీ గేర్‌లోకి!

dilraju-upcoming-movies-lineup-2024-2026

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నారు. ఇటీవల ‘గేమ్ ఛేంజర్’ ఫెయిల్యూర్ ఒక షాక్ అయినా, ‘సంక్రాంతికి వస్తున్నాం’ విజయం ఆయనకు ఊపునిచ్చింది. తాజాగా ‘తమ్ముడు’ సినిమాను జూలై 4న విడుదలకు సిద్ధం చేస్తున్నారు. ఇది ఈ ఏడాది ఆయన నుంచి వస్తున్న చివరి సినిమా కావడం విశేషం.

ఇక రాబోయే ప్రాజెక్టుల విషయానికి వస్తే, ఆయన స్వయంగా మూడు సినిమాలను లైన్‌లో పెట్టారని ప్రకటించారు. ఆగస్ట్ 2024 నుండి విజయ్ దేవరకొండ ‘రౌడీ జనార్ధన్’, నితిన్ ‘ఎల్లమ్మ’, అశీష్ నటించే ‘దేతడి’ సినిమాల షూటింగ్ మొదలుకానున్నాయి. ఇవన్నీ 2026లో విడుదల కానున్నట్లు చెప్పారు.

దిల్ రాజు మరిన్ని ప్లాన్స్‌తో ముందుకు వెళ్తున్నారు. 2027లో పాన్ ఇండియా స్థాయిలో రెండు భారీ బడ్జెట్ సినిమాలను రిలీజ్ చేయాలన్న లక్ష్యంతో కథలు, స్క్రిప్టులు తయారవుతున్నాయి. ఇతర ఇండస్ట్రీలతో కలిసి ఈ ప్రాజెక్టులు చేయనున్నట్టు తెలిపారు.

అలాగే, అల్లు అర్జున్, ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్‌లతో సినిమాలు చేసే ఆలోచనలో ఉన్నట్టు చెప్పారు. చర్చలు కొనసాగుతున్నాయనీ, త్వరలో అప్డేట్ ఇవ్వనున్నారట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular