Monday, October 5, 2026
HomeAndhra Pradeshఒకే ఏడాదిలో అభివృద్ధి చూపించాం: సీఎం చంద్రబాబు

ఒకే ఏడాదిలో అభివృద్ధి చూపించాం: సీఎం చంద్రబాబు

cm-chandrababu-on-ap-development-double-engine-rule

ఏపీ: అమరావతిలో జరిగిన ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందో చూపించామని తెలిపారు.

గత వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించిన సీఎం, వారి పాలనతో రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందని, మూడు రాజధానుల ముసుగులో నష్టమే మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్టుబడిదారుల్లో విశ్వాసం కోల్పోయిందని అన్నారు.

అధికారంలోకి రాగానే అన్న క్యాంటీన్లు, మెగా డీఎస్సీ వంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామన్నారు. ఉచిత బస్సు ప్రయాణం, ఆటో డ్రైవర్లకు ఆర్థికసాయం, తల్లికి వందనం వంటి హామీలను నెరవేర్చామని తెలిపారు.

రాయలసీమలో గంజాయి నిర్మూలన, శాంతిభద్రతల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. అమరావతి నిర్మాణం ప్రారంభమై, మూడేళ్లలో పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.

2047 నాటికి తలసరి ఆదాయం ₹55 లక్షలకు పెంచడమే లక్ష్యమని పేర్కొన్నారు. పీ-4 విధానంతో రాష్ట్ర అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular