
న్యూస్ డెస్క్: టీమిండియా పేసర్ల జోరు టెస్టు ర్యాంకింగ్స్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. ఇంగ్లండ్‌తో ఓవల్ వేదికగా జరిగిన చివరి టెస్టులో అదరగొట్టిన మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ ఇద్దరూ తమ కెరీర్‌లోనే బెస్ట్ ఐసీసీ ర్యాంకింగ్స్‌కి చేరుకున్నారు. సిరాజ్ ఏకంగా 12 స్థానాలు ఎగబాకి 15వ ర్యాంకు చేరుకోగా, ప్రసిద్ధ్ కృష్ణ తొలిసారిగా టాప్ 60లోకి వచ్చాడు.
ఆతిథ్య ఇంగ్లండ్‌పై 5వ టెస్టులో భారత జట్టు ఆరు పరుగుల తేడాతో విజయం సాధించిన సందర్భంగా సిరాజ్ 9 వికెట్లు, ప్రసిద్ధ్ 4 వికెట్లు తీసి మ్యాచు విజయంలో కీలక పాత్ర పోషించారు.
ఈ ఇద్దరూ టెస్ట్ మ్యాచులో రెండు ఇన్నింగ్స్‌లోనూ తలా నాలుగు వికెట్లు తీసిన అరుదైన బౌలింగ్ జంటగా రికార్డు సృష్టించారు. ఇలాంటిది చివరిసారి 1969లోనే భారత్‌కు జరగింది.
ఇక బ్యాటింగ్ విభాగంలో యువ క్రికెటర్ యశస్వి జైస్వాల్ మరోసారి మెరిశాడు. ఓవల్ టెస్టులో అద్భుత శతకం నమోదు చేసిన యశస్వి, ఐసీసీ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో టాప్ 5లోకి వచ్చాడు. అతను ఇప్పుడు ఐదో స్థానాన్ని ఆక్రమించి భారత క్రికెట్ అభిమానులను గర్వపడేలా చేశాడు.
ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ టాప్ స్థానం లో కొనసాగుతుండగా, మరో బ్యాటర్ హ్యారీ బ్రూక్ రెండు స్థానాలు ఎగబాకి రెండో ర్యాంక్‌కి వచ్చాడు. ఈ ఇద్దరి మధ్య రేసు ఆసక్తికరంగా మారింది.
ఇక న్యూజిలాండ్ తరఫున మ్యాట్ హెన్రీ జింబాబ్వేపై 9 వికెట్లు తీసి కెరీర్ బెస్ట్ నాలుగో ర్యాంక్ అందుకున్నాడు. మరోవైపు డారిల్ మిచెల్ బ్యాటింగ్ విభాగంలో టాప్- 0లోకి ప్రవేశించాడు.