
బాక్సాఫీస్ దగ్గర ఓ యానిమేషన్ సినిమా ఇంత భారీ సక్సెస్ సాధించడం అరుదు. కానీ ‘మహావతార్ నరసింహా’ మాత్రం ఈ సీజన్‌లో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. హోంబలే ఫిల్మ్స్ నిర్మాణంలో వచ్చిన ఈ డివోషనల్ యానిమేషన్ మూవీ ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తోంది.
దర్శకుడు అశ్విన్ కుమార్ ఈ కథను విజువల్‌గా అద్భుతంగా మలచి, చిన్నా పెద్దా అందరినీ అలరించారు. భక్తి, భావోద్వేగం, విజువల్ గ్రాండియర్ మేళవింపుతో సినిమా ప్రత్యేకంగా నిలిచింది.
పిల్లల నుంచి యూత్ వరకు అందరూ ఈ చిత్రాన్ని మళ్లీ మళ్లీ చూస్తున్నారని యూనిట్ చెబుతోంది. డివోషనల్ యానిమేషన్‌కు ఇంత పెద్ద రెస్పాన్స్ వస్తుందని మేకర్స్ కూడా ఊహించలేదని తెలిపారు.
కలెక్షన్స్ పరంగా కూడా ‘మహావతార్ నరసింహా’ అదరగొడుతోంది. ఇప్పటివరకు వరల్డ్‌వైడ్‌గా రూ.150 కోట్ల గ్రాస్ సాధించిందని అధికారికంగా ప్రకటించారు. ఇది యానిమేషన్ సినిమాలకు పెద్ద మైలురాయిగా భావిస్తున్నారు.
సినిమా డ్రీమ్ రన్ కొనసాగుతుండటంతో, బాక్సాఫీస్ వద్ద మరిన్ని రికార్డులు సాధించే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ప్రేక్షకులు సోషల్ మీడియాలో కూడా ఈ చిత్రాన్ని ప్రశంసిస్తూ పోస్టులు చేస్తున్నారు.
