
మాస్ మహారాజా రవితేజ సినిమా ప్రీమియర్లకు సాధారణంగా ఉండే సందడి ‘మాస్ జాతర’కు కనిపించలేదు. అక్టోబర్ 30 రాత్రి వేసిన పెయిడ్ ప్రీమియర్లకు ఆశ్చర్యకరంగా నీరసమైన స్పందన లభించింది. ఇది ట్రేడ్ వర్గాలను, అభిమానులను షాక్‌కు గురిచేసింది.
హైదరాబాద్‌లోని ప్రధాన మల్టీప్లెక్స్ అయిన ప్రసాద్స్‌లో సాయంత్రం వేసిన తొలి షో కూడా ఫుల్ కాలేదు. చాలా థియేటర్లలో కనీస ఆక్యుపెన్సీ లేక షోలు రద్దయ్యే పరిస్థితి ఏర్పడింది. యూఎస్‌లో సైతం బుకింగ్స్ దాదాపు లేవని టాక్.
ఈ నీరస స్పందనకు థియేటర్ యాజమాన్యాలు ‘బాహుబలి: ది ఎపిక్’ రీ-రిలీజ్‌ను కారణంగా చూపుతున్నాయి. నాలుగు గంటల ‘బాహుబలి’ చూసి ప్రేక్షకులు అలిసిపోయారని, వెంటనే మరో సినిమా చూసే ఓపిక లేక రాలేదని వారు చెబుతున్నారు.
కానీ, అసలు కారణం అది కాదని విశ్లేషకులు అంటున్నారు. ప్రేక్షకుల అభిరుచి మారింది. ‘బాహుబలి’, ‘KGF’, ‘కల్కి’ వంటి “ఈవెంట్ ఫిల్మ్‌లకు” మాత్రమే ఫస్ట్ డే పరుగులు పెడుతున్నారు. మిగతా సినిమాలకు “వెయిట్ అండ్ వాచ్” పాలసీ ఫాలో అవుతున్నారు.
‘మాస్ జాతర’ ట్రైలర్ ఈ రెండో కేటగిరీలోకి పడిపోయింది. ట్రైలర్ రొటీన్‌గా ఉండటం, కొత్తదనం లేకపోవడంతో ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచలేకపోయింది. అందుకే, టాక్ చూశాకే వెళ్దామని ప్రేక్షకులు నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది.
ఈ స్లో స్టార్ట్‌ను అధిగమించాలంటే సినిమాకు అసాధారణమైన మౌత్ టాక్ రావాలి. కంటెంట్ బలంగా ఉంటే తప్ప, ఈ ‘వెయిట్ అండ్ వాచ్’ ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించడం కష్టం. నవంబర్ 1న అసలు ఫలితం తేలనుంది.
