
మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న 157వ సినిమా “మన శంకర వరప్రసాద్” పై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది.
మెగాస్టార్ బర్త్‌డే సందర్భంగా విడుదలైన గ్లింప్స్ ఇప్పటికే అభిమానులను ఉత్సాహపరిచాయి. ఇప్పుడు ఈ సినిమాలోని ఫస్ట్ సాంగ్ దసరా పండుగకు రిలీజ్ చేయాలని యూనిట్ ప్లాన్ చేస్తోంది.
అనిల్ రావిపూడి సినిమాల్లో పాటల ప్రమోషన్స్ ఎప్పుడూ ప్రత్యేకమే. చిరు కోసం ఆయన వేసిన ప్లాన్ మరింత గ్రాండ్‌గా ఉంటుందని టాక్. భీమ్స్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో మెగాస్టార్ స్టైల్‌కు తగ్గట్టుగా పక్కా మాస్ బీట్ సిద్ధం చేశాడని సమాచారం.
ముఖ్యంగా చిరంజీవి డ్యాన్స్ హుక్ స్టెప్పులు మళ్లీ అభిమానులకు పూనకాలు తెప్పించనున్నాయని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి.
2026 సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ సినిమా భారీ అంచనాలను సెట్ చేసుకుంది. కామెడీ, ఎమోషన్, మాస్ ఎంటర్‌టైన్‌మెంట్ అన్నీ కలిపిన ప్యాకేజీగా వస్తోందని చెప్పబడుతోంది. నయనతార-చిరు కాంబినేషన్ “సైరా” తర్వాత మళ్లీ వస్తుండటంతో ఈ జోడీపై కూడా ఆసక్తి ఉంది.