
లోకేష్ కనకరాజ్ సినిమాలకు ముందు నుంచి భారీ హైప్ క్రియేట్ చేయడం తెలిసిందే. ‘కూలీ’కి కూడా అదే రేంజ్‌లో బిల్డప్ ఇచ్చారు. ముఖ్యంగా నాగార్జున, ఆమిర్ ఖాన్ పాత్రల గురించి చెప్పిన మాటలు ప్రేక్షకుల్లో అంచనాలను పెంచాయి.
కానీ రిలీజ్ తర్వాత స్క్రీన్‌పై కనిపించిన రోల్స్ చాలా సాధారణంగా అనిపించాయి. ముఖ్యంగా ఆమిర్ చేసిన కామియో అస్సలు ఆకట్టుకోలేదు.
ఇప్పటికే లోకేష్, ఆమిర్ కలిసి సూపర్ హీరో మూవీ చేస్తారని టాక్ వచ్చింది. కానీ తాజా సమాచారం ప్రకారం ఆ ప్రాజెక్ట్ అసలు జరగకపోవచ్చని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
కారణం లోకేష్ దగ్గర ఇప్పటికే పెండింగ్ కమిట్‌మెంట్లు చాలా ఉన్నాయి. ‘ఖైదీ 2’, ‘విక్రమ్ 2’, ‘రోలెక్స్’ వంటి ప్రాజెక్టుల గురించి ఏళ్లుగా చర్చ జరుగుతున్నా, ఇంకా స్టార్ట్ కాలేదు.
ఇక ‘కూలీ’లో ఆమిర్ పాత్ర ప్రభావం లేకపోవడంతో, వారి కాంబినేషన్‌పై అభిమానుల్లో కూడా ఆసక్తి తగ్గింది. పైగా లోకేష్ తరచుగా కొత్త ప్రాజెక్టుల గురించి హైప్ ఇవ్వడం అలవాటుగా మారడంతో, ఇప్పుడు ప్రేక్షకులు ఆయన మాటలపై పెద్దగా నమ్మకం పెట్టుకోవడం లేదని విశ్లేషకులు అంటున్నారు.
