Thursday, October 8, 2026
HomeBig Storyఆసియా కప్ 2025 గ్రాండ్ స్టార్ట్.. ప్రైజ్ మనీ ఎంతంటే?

ఆసియా కప్ 2025 గ్రాండ్ స్టార్ట్.. ప్రైజ్ మనీ ఎంతంటే?

asia-cup-2025-tournament-grand-opening

న్యూస్ డెస్క్: యూఏఈ వేదికగా ఆసియా కప్ 2025 క్రికెట్ టోర్నమెంట్ ఇవాళ ప్రారంభమైంది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ టోర్నీకి ఎనిమిది జట్లు బరిలోకి దిగుతున్నాయి. భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్‌తో పాటు అఫ్గానిస్తాన్, హాంకాంగ్, యూఏఈ, ఒమన్ జట్లు తలపడుతున్నాయి.

గ్రూపుల వివరాలు
గ్రూప్-ఏలో భారత్, పాకిస్థాన్, యూఏఈ, ఒమన్ ఉంటే, గ్రూప్-బీ లో శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్, హాంకాంగ్ పోటీపడతాయి. మొదటి మ్యాచ్ అబుదాబిలో అఫ్గానిస్తాన్-హాంకాంగ్ మధ్య ప్రారంభమవగా, రేపు భారత్ యూఏఈతో ఆడనుంది.

భారత్ పాక్ హైవోల్టేజ్ క్లాష్
ప్రేక్షకులంతా ఎదురుచూస్తున్న భారత్-పాక్ మ్యాచ్ సెప్టెంబర్ 14న జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. రాత్రి 8 గంటలకు మ్యాచ్‌లు ప్రారంభం కావడంతో భారత అభిమానులకు అనుకూలంగా ఉంటుంది.

ప్రైజ్ మనీ స్పెషల్
ఈసారి విజేత జట్టుకు రూ.2.6 కోట్ల ప్రైజ్ మనీ ప్రకటించారు. రన్నరప్ జట్టుకు రూ.1.3 కోట్లు అందించనున్నారు. గతంలో కంటే 50 శాతం ఎక్కువ మొత్తాన్ని ప్రకటించడం గమనార్హం.

టీమిండియా స్క్వాడ్
సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా, శుభమన్ గిల్ వైస్ కెప్టెన్‌గా ఉన్నారు. హార్దిక్ పాండ్యా, బుమ్రా, కుల్దీప్ యాదవ్, రింకూ సింగ్, సంజు శాంసన్ కీలక ఆటగాళ్లు. రిజర్వ్‌గా యశస్వి జైస్వాల్, వాషింగ్టన్ సుందర్ వంటి యంగ్ టాలెంట్స్ ఉన్నారు.

భారత్ డిఫెండింగ్ ఛాంపియన్‌గా మరోసారి టైటిల్‌ను కాపాడుకోవాలని చూస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular