
న్యూస్ డెస్క్: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన తర్వాత, ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్‌లో కూడా సర్‌ప్రైజ్ ఇస్తూనే ఉన్నాడు. తాజాగా విడుదలైన ది ఛేజ్ టీజర్‌తో ఆయన హీరోగా ఎంట్రీ ఇచ్చేయడం అభిమానులకు ఊహించని గిఫ్ట్‌గా మారింది. ఎలాంటి లీక్ లేకుండా వచ్చిన ఈ టీజర్ బంపర్ హిట్ అయింది.
టీజర్‌లో ధోని స్టైలిష్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించాడు. ఆయనతో పాటు ఆర్.మాధవన్ కూడా మరో కాప్ పాత్రలో ఉన్నాడు. వాసన్ బాలా దర్శకత్వం వహించిన ఈ ప్రాజెక్ట్ క్రైమ్ బ్యాక్‌డ్రాప్‌లో ఉత్కంఠభరితమైన కాప్ డ్రామాగా కనిపిస్తోంది. బ్యాడ్ బాయ్స్ లేదా సింగం ఫ్రాంచైజీల లాగా స్టైలిష్ ఎలివేషన్లు ఇవ్వడం టీజర్ స్పెషల్ హైలైట్‌గా మారింది.
అయితే ఇది సినిమా టీజర్‌నా, వెబ్ సిరీస్‌నా లేక కేవలం ఒక బ్రాండ్ ప్రోమోనా అన్నది ఇంకా క్లారిటీ లేదు. కానీ ధోని యాక్షన్ అవతార్, ఆయన డైలాగ్ డెలివరీ అభిమానుల్లో ఆసక్తి పెంచింది. మాధవన్ కూడా సపోర్ట్ రోల్‌లో పవర్‌ఫుల్‌గా కనిపించాడు.
ధోని గతంలో ప్రకటనల్లో, అతిథి పాత్రల్లో కనిపించాడు. కానీ హీరోగా పూర్తి స్థాయి ప్రాజెక్ట్ చేస్తాడని ఎవరూ ఊహించలేదు. ఈ టీజర్‌తో మాత్రం సినిమా రంగంలో ఆయన కొత్త ప్రయాణం మొదలయ్యిందా అనే చర్చ మొదలైంది.
