న్యూస్ డెస్క్: పండుగల సీజన్‌లో ప్రయాణికుల రద్దీ తగ్గించేందుకు రైల్వే శాఖ ముందుగానే కీలక నిర్ణయం తీసుకుంది. దసరా, దీపావళి సమయంలో ప్రయాణికుల సౌకర్యార్థం మొత్తం 122 ప్రత్యేక రైళ్లను నడపనుందని అధికారులు ప్రకటించారు.
ఈ రైళ్లు సెప్టెంబర్ 10 నుంచి డిసెంబర్ 3 వరకు అందుబాటులో ఉంటాయి. సాధారణంగా పండుగల సమయంలో సాధారణ రైళ్లలో రద్దీ ఎక్కువవుతుంది.
ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మధురై, చెన్నై, బెంగళూరు, బీదర్, తిరునెల్వేలి, శివమొగ్గ వంటి మార్గాల్లో అదనపు రైళ్లు నడపనున్నారు. ముఖ్యంగా మధురై-బరౌని, చెన్నై-బరౌని, షాలిమార్-చెన్నై మధ్య 30కి పైగా సర్వీసులు ఏర్పాటు చేశారు.
ఇక బెంగళూరు-బీదర్ మధ్య 9, తిరునెల్వేలి-శివమొగ్గ మధ్య 8, తిరువనంతపురం-సంత్రాగచి మధ్య 7 రైళ్లు నడుస్తాయి. అదనంగా చెన్నై-సంత్రాగచి మధ్య 3 ప్రత్యేక సర్వీసులు ప్రకటించారు.
ప్రయాణికులు ఈ రైళ్ల సమయాలు, ఆగే స్టేషన్లు, టికెట్ లభ్యత వంటి వివరాలను రైల్వే అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవాలని సూచించారు. పండుగల సీజన్‌లో ఈ రైళ్లు ప్రయాణికులకు పెద్ద ఉపశమనం కలిగించనున్నాయి.
