
కన్నడ స్టార్ రిషబ్ శెట్టి హీరోగా, రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటించిన “కాంతార చాప్టర్ 1” బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల తుఫాన్ సృష్టిస్తోంది. రిషబ్ స్వయంగా దర్శకత్వం వహించిన ఈ సినిమా మూడు రోజుల్లోనే వసూళ్ల రికార్డులు తిరగరాసింది.
తాజా సమాచారం ప్రకారం, “కాంతారా 1” మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 235 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. మొదటి రోజు నుంచే ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో, థియేటర్ల వద్ద హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి.
ఆదివారం నాటికి ఈ సినిమా మరో 50 కోట్లకు పైగా వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
అంటే నాలుగు రోజుల్లోనే “కాంతారా చాప్టర్ 1” 300 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశముంది. కన్నడ మార్కెట్‌తో పాటు హిందీ, తెలుగు, తమిళ భాషల్లో కూడా ఈ సినిమా దుమ్మురేపుతోంది.
హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ డివోషనల్ యాక్షన్ డ్రామా ప్రస్తుతం సౌత్ ఇండియన్ సినిమా చరిత్రలో కొత్త అధ్యాయాన్ని రాస్తోంది.