వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ మోహన్ రెడ్డి మరోసారి కూటమి ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటిపై జరిగిన దాడిని ఖండిస్తూ సంచలన ఆరోపణలు చేశారు.
ఈ దాడి టీడీపీ అధినేత చంద్రబాబు ప్రోత్సాహంతోనే జరిగిందని జగన్ ఆరోపించారు. పోలీసుల సమక్షంలోనే టీడీపీ రౌడీలు దాడికి పాల్పడ్డారని అన్నారు.
ఆరుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ప్రసన్నను అంతం చేయాలనే లక్ష్యంతో దాడి జరిగిందని తెలిపారు. అతని వృద్ధ తల్లి కూడా బెదిరింపులకు గురైందని ఆవేదన వ్యక్తం చేశారు.
తాను చిత్తూరులో మామిడి రైతుల సమస్యలు తెలుసుకుంటున్న సమయంలో దృష్టి మళ్లించేందుకే ఈ కుట్ర చేశారని విమర్శించారు. ఇది ప్రజాస్వామ్యంపై జరగిన దాడి అని అన్నారు.
చంద్రబాబు తన ‘రెడ్ బుక్’ పాలనతో హింసను ప్రోత్సహిస్తున్నారని జగన్ ఆరోపించారు. ఇలా చేస్తే ప్రతిపక్ష గొంతు నొక్కలేరని హెచ్చరించారు.