
స్పోర్ట్స్ డెస్క్: ఇంగ్లండ్ తో మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో టీమిండియా బౌలర్లు తీవ్రంగా విఫలమయ్యారు. గత 10 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా భారత బౌలింగ్ యూనిట్ పరాజయాన్ని ఎదుర్కొంది. ముఖ్యంగా స్టార్ బౌలర్ బుమ్రా, సిరాజ్, అరంగేట్ర ఆటగాడు అన్షుల్ కంబోజ్, శార్దూల్ ఠాకూర్ ఇలా పేసర్లు విఫలమయ్యారు.
బౌలర్లు వికెట్లు తీయడంలో విఫలమవడమే కాకుండా, ఇంగ్లండ్ బజ్‌బాల్ బ్యాటింగ్ ముందు ఎదురులేకపోయారు. ధారాళంగా పరుగులు సమర్పించుకుని చెత్త రికార్డు నమోదైంది. గతంలో 2015లో చివరిసారిగా టీమిండియా ఓవర్‌సీస్‌లో 500కు పైగా పరుగులు ఇచ్చింది. తాజాగా మళ్లీ ఇదే దారుణాన్ని మళ్లీ చూశారు.
ఈ మ్యాచ్‌లో మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 135 ఓవర్లలో 7 వికెట్లకు 544 పరుగులు చేసింది. భారత బౌలర్లలో జడేజా, వాషింగ్టన్ సుందర్ తలో రెండు వికెట్లు తీసారు. సిరాజ్, బుమ్రా, కంబోజ్ చెరో వికెట్ తీసారు.
ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 186 పరుగుల ఆధిక్యంలో ఉంది. టీమిండియా తన మొదటి ఇన్నింగ్స్‌లో 358 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఈ రికార్డు టీమిండియా బౌలింగ్ యూనిట్‌లో అనేక ప్రశ్నలు రేపుతోంది.
బౌలింగ్ విఫలం, వికెట్లు తీయడంలో తడబడటం, ఓవర్‌సీస్‌లో మళ్లీ ఇలాంటి చెత్త రికార్డులు నమోదవుతున్నాయి. భారత బౌలర్లకు ఇది గట్టి హెచ్చరిక అని విశ్లేషకులు చెబుతున్నారు.