
స్పోర్ట్స్ డెస్క్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. నకిలీ పత్రాలతో అధ్యక్ష పదవి దక్కించుకున్నారన్న ఆరోపణలతో జగన్మోహన్‌రావును సీఐడీ అధికారులు బుధవారం అరెస్ట్ చేశారు.
సీఐడీ ప్రకారం, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ పేరుతో నకిలీ పత్రాలు సృష్టించి, వాటిని ఆధారంగా చేసుకుని హెచ్‌సీఏ ఎన్నికల్లో జగన్మోహన్ పోటీ చేసి గెలిచినట్లు తేలింది.
ఈ క్లబ్ ప్రెసిడెంట్‌గా ఉన్న కవితతో పాటు, గౌలిపురా క్రికెట్ క్లబ్‌కి చెందిన మాజీ మంత్రి కృష్ణయాదవ్ సంతకాలు కూడా ఫోర్జరీ చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
ఈ మోసంపై టీసీఏ అధ్యక్షుడు గురువారెడ్డి ఫిర్యాదు చేయడంతో కేసు వెలుగులోకి వచ్చింది. తర్వాత విచారణలో నిధుల దుర్వినియోగానికి సంబంధించి ఆధారాలు లభించాయి.
జగన్మోహన్‌రావుకు సహకరించిన హెచ్‌సీఏ కోశాధికారి శ్రీనివాసరావు, సీఈవో సునీల్ కూడా అరెస్టయ్యారు. రాజేందర్ యాదవ్, కవితలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ అరెస్టులు హెచ్‌సీఏ పరిపాలనలో భారీ సంచలనంగా మారాయి. క్రికెట్ పాలక వ్యవస్థపై ప్రశ్నలు ఎదిరిస్తున్నాయి.