
కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పది కేంద్ర కార్మిక సంఘాల ఉమ్మడి ఫోరం బుధవారం భారత్ బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ సమ్మెలో 25 కోట్ల మంది కార్మికులు పాల్గొంటారని సంఘాల నేతలు తెలిపారు.
కార్మికులు, రైతులు, ప్రజలకు నష్టంగా, కార్పొరేట్లకు లాభంగా కేంద్రం నిర్ణయాలు తీసుకుంటోందని వారు ఆరోపించారు. ఇది దేశ ప్రయోజనాలకు విరుద్ధమని స్పష్టం చేశారు.
బ్యాంకులు, బీమా, బొగ్గు గనులు, రవాణా వంటి కీలక రంగాల్లో ఈ సమ్మె ప్రభావం చూపనుంది. హింద్ మజ్దూర్ సభ నేత హర్భజన్ సింగ్ సిద్ధూ ఈ విషయాన్ని వెల్లడించారు.
17 డిమాండ్లపై సమర్పించిన పత్రాన్ని ప్రభుత్వం పట్టించుకోలేదని కార్మిక సంఘాలు మండిపడ్డాయి. లేబర్ కోడ్‌లు హక్కులను హరించేవిగా ఉన్నాయని పేర్కొన్నారు.
ప్రైవేటీకరణ, ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు విధానాలను వ్యతిరేకిస్తున్నామన్నారు. యూనియన్ల కార్యకలాపాలపై దెబ్బతీశారని విమర్శించారు.
ఈ సమ్మెకు సంయుక్త కిసాన్ మోర్చా మద్దతు ప్రకటించింది. గ్రామీణ ప్రాంతాల్లోనూ పెద్ద ఎత్తున నిరసనలు జరుగనున్నాయి.
