
తాజాగా “కుబేర” హిట్‌తో దూసుకుపోతున్న ధనుష్, మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టాడు. ధనుష్ కెరీర్‌లో 54వ సినిమాగా ఈ చిత్రం దర్శకుడు విగ్నేష్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతోంది.
ప్రాజెక్ట్ ప్రకటించిన పోస్టర్ ఇప్పటికే ఆసక్తిని రేపుతోంది. ఇందులో ధనుష్ దిగులుగా నిలబడి ఉండగా, వెనుక రైతుల పంట కాలిపోతున్న దృశ్యం కనిపిస్తోంది.
దీనితో ఈ సినిమాలో ధనుష్ రైతు పాత్రలో కనిపించబోతున్నాడని స్పష్టమవుతోంది. మరోసారి ఆయన రూరల్ ఎమోషనల్ డ్రామాతో ప్రేక్షకులను ఆకట్టేందుకు సిద్ధమవుతున్నాడు.
ఈ చిత్రానికి యువ సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఆయన-ధనుష్ కాంబినేషన్‌కు మంచి క్రేజ్ ఉంది.
వేల్స్ ఫిల్మ్స్ ఎంటర్టైన్మెంట్స్, థింక్ స్టూడియోస్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం షూటింగ్ ప్రారంభమై పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో రూపొందుతోంది.
dhanush 54th movie, dhanush farmer role, vignesh raja director, gv prakash music, dhanush new movie 2025,