Thursday, July 16, 2026
HomeMovie News'ది రాజా సాబ్'లో ప్రభాస్ టైమింగ్ పై SKN కామెంట్స్

‘ది రాజా సాబ్’లో ప్రభాస్ టైమింగ్ పై SKN కామెంట్స్

prabhas-comedy-timing-in-the-raja-saab

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ది రాజా సాబ్ సినిమాపై భారీ ఆసక్తి నెలకొంది. మారుతి దర్శకత్వంలో హారర్ కామెడీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రతీ కోణంలో ప్రత్యేకతను సొంతం చేసుకుంటోంది.

ఈ సినిమాలో ప్రభాస్ రెండు విభిన్నమైన గెటప్స్‌లో కనిపించనున్నట్టు చిత్ర యూనిట్ వెల్లడించింది. ఇందులో ఆయన టైమింగ్ మాస్టర్గా ఆకట్టుకుంటాడని చెబుతున్నారు.

ఈ మేరకు క్రియేటివ్ ప్రొడ్యూసర్ SKN మాట్లాడుతూ, “ప్రభాస్ టైమింగ్ సూపర్బ్‌గా ఉంది. సెట్స్‌లో చూస్తూ ఎంజాయ్ చేస్తున్నా. ఊరికే పాన్ ఇండియా స్టార్ కాలేరు” అంటూ ప్రశంసలు కురిపించారు.

ఈ కామెంట్స్‌తో ప్రభాస్ టైమింగ్‌ను థియేటర్‌లో చూసేందుకు అభిమానులు మరింత ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఆయన కామెడీ టైమింగ్ చాలా కాలం గుర్తుండిపోయేలా ఉంటుందని భావిస్తున్నారు.

ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. ప్రభాస్ ఈ సినిమాతో మరోసారి ప్రేక్షకులను నవ్విస్తూ మెప్పించనున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular