
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమా భారీ అంచనాల నడుమ షూటింగ్ కొనసాగుతోంది. వశిష్ట మల్లిడి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తోంది.
ఈ సినిమాను అనేకసార్లు వాయిదా వేయడంతో అభిమానుల్లో నిరీక్షణ పెరిగిపోయింది. తాజా సమాచారం మేరకు ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌కి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
అది చిరంజీవి అన్నయ్య సినిమాలో హిట్ అయిన “ఆట కావాలా పాట కావాలా” పాట రీమిక్స్ కావడం విశేషం. ఈ రీమిక్స్ వెర్షన్‌ను భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేయబోతున్నాడు.
ఈ పాటకు మ్యూజిక్ డైరెక్టర్ ఎనర్జిటిక్ బీట్స్ ఇస్తారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. చిరుతో పాటు ఈ పాటలో బాలీవుడ్ బ్యూటీ మౌని రాయ్ స్టెప్పులేసే అవకాశం ఉందని టాక్.
పాట చిత్రీకరణ కోసం స్పెషల్ సెట్స్ వేస్తున్నట్టు సమాచారం. మౌనీ రాయ్ గ్లామర్‌తో ఈ పాట సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా మారనుంది.
త్రిష హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా పూర్తి సోషియో ఫాంటసీ నేపథ్యంలో రూపొందుతోంది. విడుదల తేదీపై త్వరలో క్లారిటీ ఇవ్వనున్నారు.
