Thursday, February 12, 2026
HomeMovie News‘అఖండ 2’లో కల్కి నటుడు.. సర్ ప్రైజ్ రోల్!

‘అఖండ 2’లో కల్కి నటుడు.. సర్ ప్రైజ్ రోల్!

akhanda2-saswata-chatterjee-key-role-in-balakrishna-movie

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న అఖండ 2 సినిమాపై ప్రేక్షకుల్లో భారీగా ఆసక్తి నెలకొంది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ మాస్ ఎంటర్టైనర్‌పై అంచనాలు భారీగానే ఉన్నాయి.

ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర టాక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ‘కల్కి 2898 ఎడి’లో నటించిన శాశ్వత చటర్జీ ఈ సినిమాలో నటించబోతున్నారట.

శాశ్వత చటర్జీ ‘అఖండ 2’లో కీలక పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం. అయితే ఆయన పాత్ర ఎలా ఉండబోతుందనే దానిపై మరింత ఆసక్తి నెలకొంది.

ఈ సినిమాలో బాలయ్య మళ్లీ రెండు వైవిధ్యమైన పాత్రల్లో దర్శనమివ్వనున్నాడు. ఫ్యాన్స్ కోసం మాస్ యాక్షన్, పూజా పవర్ రెండూ మిక్స్ చేసి చూపించనున్నారు.

సంజుక్తా మీనన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. మ్యూజిక్ కూడా ఈ సినిమాకే ఓ హైలైట్ అవుతుందని అంటున్నారు.

ఈ మాస్ అండ్ డివోషనల్ మూవీని దసరా కానుకగా సెప్టెంబర్ 25న గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular